ఏప్రిల్ 22 నుంచి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె: 60 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం!
తెలంగాణలో మరోసారి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ప్రకటించింది. సోమవారం జరిగిన సమావేశంలో జేఏసీ నేతలు ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. సమ్మెకు కారణం ఏంటి? జేఏసీ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ.. గత మార్చి 13నే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ సరైన స్పందన చూపలేదని పేర్కొన్నారు. […]




